01-05-2025 12:00:00 AM
మై హోమ్ గ్రూప్స్ డైరెక్టర్ జూపల్లి వినోద్ రావు
కోదాడ ఏప్రిల్ 30: వినియోగదారుల నమ్మకానికి అనుగుణంగా నాణ్యమైన నిర్మాణాలు చేపట్టి నిర్మాణరంగంలో రాణించాలని మై హోమ్ గ్రూప్స్ డైరెక్టర్ జూపల్లి వినోద్‌రావు తెలిపారు. బుధవారం కోదాడ పట్టణం ప్రమీల టవర్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన జిఎంఏ ఇన్ ఫ్రా డెవలపర్స్ కార్యాలయాన్ని పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, సంస్థ ఎండి జాకీర్ హుస్సేన్ తో కలిసి వారు ప్రారంభించారు.
అనంతరం కార్యాలయంలో సంస్థ బ్రోచర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. గుడిబండ రోడ్డు లో గల తమ కార్యాలయంలో జిఎంఏ సంస్థ వారు నూతన భవనాన్ని పూర్తి నాణ్యతతో నిర్మించి సకాలంలో అందించినందుకు గాను వారికి అభినందనలు తెలిపారు. సంస్థ ఎండి జాకీర్ హుస్సేన్, అల్తాఫ్ హుస్సేన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, కౌశిక్, రాజశేఖర్, అశోక్, మహమ్మద్ ఎజాజ్ కోదాడ నియోజకవర్గం కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు అజీమ్ బాయ్ ,బాబురావు పాల్గొన్నారు.