calender_icon.png 1 May, 2025 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్రికా ప్రకటనకు స్పందించి ఆదేశాలివ్వడం హర్షణీయం

01-05-2025 12:00:00 AM

వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి రుద్ర తిరుపతి

గూడూరు, ఏప్రిల్ 30: (విజయ క్రాంతి) ఇందిరమ్మ ఇల్లు రాజీవ్ యువ వికాసం పథకంలో వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పత్రికా ప్రకటనలో కోరగా వెంటనే స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిశు సంక్షేమ వృద్ధుల వికలాంగుల శాఖ మంత్రి సీతక్క ఆ రీతిగా చర్యలు తీసుకోవడం హర్షణీయమని మానుకోట వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి అన్నారు.

బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వికలాంగుల సమస్యలను ప్రజాప్రతినిధుల దగ్గరికి తీసుకెళ్తే వారు స్పందించి ఆదేశాలు ఇవ్వడం ఎంతో మంది వికలాంగుల బ్రతుకుల భరోసా నింపుతుందని అదే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళ్లడం హర్ష నియమని అన్నారు.

అదేవిధంగా రాజీవ్ యువ వికాసం పథకంలో వికలాంగులకు ఐదు శాతం వర్తింప చేస్తానని మంత్రి చెప్పడం సంతోషంగా ఉందని అదేవిధంగా వికలాంగులకు కావలసిన నాణ్యమైన ఆపరేషన్లు ప్రభుత్వమే భరించి ఆపరేషన్లు చేసేటట్లు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు ఈ సందర్భంగా మండల జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రికి దినసరి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.