18 June, 2026 | 4:18 PM

Breaking News

గుడిసెల్లో నివసించే నిరుపేదలకే తొలి ప్రాధాన్యత – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు   •   తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు 120 స్టీల్ వాటర్ బాటిల్ ల పంపిణీ...   •   నకిలీ విత్తనాలు అమ్మితే కేసులు నమోదు   •   ప్రైవేట్ పాఠశాలల అక్రమ వసూళ్ల పై చర్యలు తీసుకోవాలి   •   బాసర ఐఐటీ సీటు సాధించిన విద్యార్థినికి సన్మానం   •   బిజినేపల్లిలో సారా తయారీదారులపై బైండోవర్ కేసులు   •   సీసీ కెమెరాలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే   •   ప్రభుత్వ పాఠశాలలో చదివితే బంగారు భవిష్యత్తు   •   ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడిగా అందె అశోక్   •   రైతులకు సర్కార్ శుభవార్త..! 30న 'రైతు భరోసా' నిధులు విడుదల   •  

క్రమశిక్షణతో కృషి చేస్తే లక్ష్యాలు సాధ్యం - గజ్వేల్ సీఐ రవికుమార్

18-06-2026 02:48 PM

గజ్వేల్,(విజయక్రాంతి): యువత క్రమశిక్షణ, పట్టుదలతో లక్ష్య సాధనకు కృషి చేస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని గజ్వేల్ సీఐ రవికుమార్ అన్నారు. గజ్వేల్ పట్టణంలోని ఆజాద్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆర్మీ అగ్నివీర్ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశ సేవకు అవకాశం కల్పించే అగ్నివీర్ ఉద్యోగాలు సాధించిన యువకులు ఇతర యువతకు ఆదర్శంగా నిలవాలని ఆయన సూచించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి శ్రమిస్తే విజయాలు సాధించవచ్చన్నారు. యువత శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా కూడా బలంగా ఉండాలని, పోటీ ప్రపంచంలో నిరంతరం శ్రమించాలని సూచించారు.

ఈ సందర్భంగా అగ్నివీర్ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను సీఐ రవికుమార్ అభినందించి, వారి భవిష్యత్ సేవలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అకాడమీ నిర్వాహకులు విజేతలకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అకాడమీ నిర్వాహకులు నీల చంద్రం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత యువతకు నాణ్యమైన శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో రిటైర్డ్ కల్నల్ శ్రీనివాస్ రావు, సురేందర్ రెడ్డి, స్కైలాబ్ రెడ్డి, మధుసూదన్, అకాడమీ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.