27-11-2025 05:09:21 PM
నిర్మల్ రూరల్: నిర్మల్ జిల్లాలో గిరిజన అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనం కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారి జాదవ్ అంబాజీ నాయక్ తెలిపారు. ఉపకార వేతనం కోసం అభ్యర్థులు కులము ఆదాయం స్టడీ సర్టిఫికెట్ నివాసం బ్యాంక్ ఖాతా ఫోటోలతో ఆన్లైన్లో వచ్చే నెల 12లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థికి ఉపకార వేతనాలు అందించేలా ఉపాధ్యాయులు సహకరించాలన్నారు.