calender_icon.png 27 November, 2025 | 7:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యారంగ సమస్యలపై నిరంతర పోరాటం

27-11-2025 05:10:42 PM

నిర్మల్ (విజయక్రాంతి): విద్యారంగ సమస్యలపై పిడిఎస్యు నిరంతర పోరాటం చేస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో పిడిఎస్యు జిల్లా మహాసభలను నిర్వహించగా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఎన్జీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన కార్యదర్శి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ముకాశ విధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. విద్యార్థులు ఉపకార వేతనం కోసం పోరాటం చేయవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యా విద్యా హక్కు చట్టాన్ని కొన్ని సంస్థలు ఉల్లంఘించిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేష్ మహేందర్ రాజన్న కిరణ్, తదితరులు పాల్గొన్నారు.