23-09-2025 06:15:00 PM
మద్నూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మద్నూర్ చిత్రకళ ఉపాధ్యాయుడు బాస బాల్ కిషన్ తన కళా నైపుణ్యాన్ని చాటుకున్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని ఓ కళాకారుడు వినూత్నరీతిలో అమ్మవారిపై తన భక్తిని చాటుకున్నాడు.జొన్న రొట్టెపై దుర్గామాత చిత్రాన్ని గీసి ఆశ్చర్యపరిచారు. దుర్గామాత ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని ఆయన సందేశం ఇచ్చారు. ఈ చిత్రాన్ని చూసిన ప్రజలు బాస బాల్ కిషన్ ను ప్రశంసించారు.