23-09-2025 06:11:00 PM
నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్ల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ అన్నారు మంగళవారం నిర్మల్ పట్టణంలో సమావేశం నిర్వహించి వారి డిమాండ్లపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ లో నియమించబడ్డ సర్వీస్ పర్సనల్ స్వేచ్ఛ కార్మికుల జీతాలను జూన్ నెల నుంచి ఇప్పటివరక కు జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. వెంటనే విడుదల చేయాలి. ప్రతి నెల నెల సకాలంలో వేతనాలు అందించాలి.
2016 నుంచి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నామని మా సమస్యలు ఇప్పటివరకు పరిష్కారం కావడం లేదన్నారు. పాఠశాలలోని గదులను, మరుగుదొడ్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచే కార్మికులను గుర్తించాలని కోరారు. కార్మికుల జీతాలను నెలనెలా బ్యాంకు అకౌంట్ ద్వారా చెల్లించాలన్నారు. పాఠశాల విద్యార్థుల సంఖ్యను బట్టి కాకుండా ప్రతి సర్వీస్ పర్సన్ వేతనం పెంచాలి. అంతేకాకుండా ప్రతి కార్మికుడికి యూనిఫామ్, ఐడి కార్డు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ప్రమాద బీమా కల్పించాలని సౌకర్యం కల్పించాలి.
నూతన కమిటీ ఎన్నిక:
జిల్లా గౌరవ అధ్యక్షునిగా బొమ్మెన సురేష్, జిల్లా అధ్యక్షుడు మారుతి, జిల్లా ఉపాధ్యక్షులు:- పోశెట్టి, భోజన్న, ఫర్జానా, R.సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి గొందూర్, మల్లేష్, జిల్లా సహాయ కార్యదర్శిలు:- సత్తన్న,లక్ష్మణ్, లక్ష్మి, పోశెట్టి, కోశాధికారి:- రాజేశ్వర్