29-09-2025 07:16:33 PM
గరిడేపల్లి (విజయక్రాంతి): గరిడేపల్లి మండలంలోని కీతవారిగూడెం గ్రామం నందు దసరా శరన్నవరాత్రుల సందర్భంగా మహా సరస్వతి దేవి అవతారంలో ఎనిమిదవ రోజు సోమవారం భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారు ప్రత్యేక వస్త్రములతో చదువుల తల్లి సరస్వతిని అలంకరించారు. గ్రామంలోని మహిళలు దాదాపు 160 మంది మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. సందర్భంగా పూజారి శ్రీ రాయప్రోలు శ్రీరామయ్య శర్మ మాట్లాడుతూ అమ్మవారిని పూజించినట్లయితే సకల విద్యలు కలుగుతాయని, విద్య ద్వారానే సకల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని తెలిపారు. మహిళ భక్తులు ప్రగాఢ విశ్వాసంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు అమ్మవారి ప్రత్యేకమైన మాల ధారణతో వేదమంత్రోత్సవాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.