10 April, 2026 | 7:44 AM

గోబెల్స్ మళ్లీ పుట్టాడు!

01-05-2024 01:38 AM

కేసీఆర్‌ను చూస్తుంటే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే యూనివర్సిటీ మూసేస్తున్నట్లు దిక్కుమాలిన, దివాలాకోరు ప్రచారం చేయడం కేసీఆర్ దిగజారుడుతనానికి పరాకాష్ట. మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్‌నగర్‌లో, ఈ రోజు ఉస్మానియా యూని వర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్న 2023 మేలో కూడా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ వేసవి సెలవులకు సంబంధించి నెల రోజులపాటు హాస్టళ్లు, మెస్‌లు  మూసివేయాలని ఆదేశిస్తూ, అందులో విద్యుత్తు, నీటి కొరత గురించి ప్రస్తావించారు.

 ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి