31-12-2025 01:49:03 AM
ఆలేరు, డిసెంబర్ 30 (విజయక్రాంతి): ఆలేరు మండలంలోని గొలనుకొండ సర్పంచ్, ఉప సర్పంచులు ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మంగళవారం నాడు గ్రామపంచాయతీ కార్యాలయంలో కేక్ కట్ చేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏ. జి. పి. ఏ. భీమగాని హరిబాబు మాట్లాడుతూ సర్పంచ్ గా ఇందూరి యాదిరెడ్డి, ఉప సర్పంచ్ గా యాదగిరి గెలుపొందిన వార్డ్ మెంబర్లకు శుభాకాంక్షలు తెలిపారు, ప్రజా ప్రతినిధులుగా గొలనుకొండ గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా ఆలేరు నియోజకవర్గంలో నిలబెట్టాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
తల్లిదండ్రులతో పాటు పుట్టిన ఊరుకు సేవ చేయడం చాలా అదృష్టం ఉండాలన్నారు. ప్రజలు ఎన్నో ఆశలతో మిమ్మల్ని గెలిపించారని వారి ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి పథంలో గ్రామపంచాయతీ పయనించాలన్నారు, ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాకీ లక్ష్మి, మాజీ ఎంపీటీసీ రాం మల్లయ్య, రాములు, బాకీ అశోక్ మరియు గ్రామ కార్యదర్శి, వార్డ్ మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.