calender_icon.png 8 July, 2025 | 1:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద యువకుడి ప్రతిభకు గోల్డ్ మెడల్

08-07-2025 01:37:30 AM

గవర్నర్ జిష్ణు దేవ్ చేతుల మీదుగా పట్టా అందుకున్న రంజిత్ 

భీమదేవరపల్లి, జూలై 7 ( విజయక్రాంతి) : కాకతీయ యూనివర్సిటీలో జరిగిన 23 వ స్నాతకోత్సవంలో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రత్నగిరి గ్రామానికి చెందిన చిట్టెంపల్లి రంజిత్ కుమార్ ఎం.ఏ పొలిటికల్ సైన్స్ విభాగంలో గోల్ మెడల్ అందుకొని గ్రామానికే కాకుండా కాకుండా రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచాడు.

రాష్ట్ర గవర్నర్ గారి చేతులమీదుగా ఈ గౌరవాన్ని అందుకోవడం విశేషం. పేద దళిత కుటుంబంలో పెరిగిన రంజిత్ చిన్నప్పటి నుంచే చదువుపట్ల ఆసక్తితో ముందడుగు వేశాడు. ఆయన తండ్రి వంగర గురుకుల పాఠశాలలో వాచ్మెన్గా పనిచేస్తుండగా, అనారోగ్య కారణంగా విధులకు దూరమయ్యారు. అప్పటి నుంచి తల్లి, అన్న సహకారంతో రంజిత్ తన విద్యను కొనసాగించాడు.

ప్రస్తుతం న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్న రంజిత్, ప్రతికూల పరిస్థితుల్లో కూడా కృషి చేస్తే ఎలా ముందుకు రావచ్చో తన జీవితంతో నిరూపించాడు. ఆయనకు గోల్ మెడల్ లభించడం పట్ల గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తూ, అభినందనలు వెల్లువెత్తించారు. ‘కష్టపడితే సాధ్యం కానిది ఏదీ లేదు‘ అనే మాటకు సజీవ సాక్ష్యంగా నిలిచాడు రంజిత్.