24-10-2025 12:10:18 AM
-10 గ్రాములపై రూ.2,600కుపైనే..
-హైదరాబాద్‌లో తులం రూ.1,28,300
హైదరాబాద్, అక్టోబర్ 23(విజయక్రాం తి): అంతర్జాతీయ పరిస్థితుల రీత్యా బుధవారం దొగొచ్చిన బంగారం, వెండి ధరలు గురువారం మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల గోల్డ్ ధర బుధవారంతో పోలిస్తే రూ.2,600పైగా పెరిగింది. ప్రస్తుత మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర 1,28,300 పలికింది.
22 క్యారెట్ల పసిడి రూ.1,14,650గా ఉన్నది. మరోవైపు కిలో వెండిపై దాదాపు రూ.3వేలకు పైనే పైకి ఎగబాకింది. మార్కెట్‌లో కేజీ వెండి రేట్ రూ.1,59,500 దాటిం ది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగా రం ధర 4,121 డాలర్లుగా, ఔన్స్ వెండి ధర 49.18 డాలర్లకు చేరింది. అత్యంత గరిష్టాలకు చేరిన ఈ లోహాల్లో మదుపర్లు లాభాల స్వీకరణకు రావడం, భారత్ సహా వివిధ దేశాల పన్నుల విషయంలో అమెరికా దిగి వస్తుందనే సంకేతాలు ఉన్నాయి.