calender_icon.png 4 October, 2025 | 6:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికాలో బీఎన్ రెడ్డి నగర్ నివాసి మృతి

04-10-2025 03:45:51 PM

టీచర్స్ కాలనీలో మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 

ఎల్బీనగర్: అమెరికాలో జరిగిన కాల్పుల్లో మృతి చెందిన మృతుడి కుటుంబ సభ్యులను శనివారం మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న పోలే చంద్రశేఖర్ రెండేండ్ల క్రితం అమెరికాలోని డల్లాస్ కు ఉన్నతచదువుల కోసం వెళ్లాడు. కాగా, అమెరికాలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో చంద్రశేఖర్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వీలైనంత త్వరగా చంద్రశేఖర్ మృతదేహాన్ని ఇండియాకు రప్పిస్తామని హామీ ఇచ్చారు.