04-10-2025 03:06:10 PM
ఇబ్రహీంపట్నం: నవమాసాలు మోసి కన్న తల్లిని జీవితాంతం అత్యంత జాగ్రత్తగా చూసుకోవాల్సిందిపోయి. ఓ కసాయి కొడుకు, కన్న తల్లినే కడతేర్చాడు. ఈ ఘటన మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా, మంచాల మండల పరిధిలోని ఆరుట్ల గ్రామానికి చెందిన మానిపాటి ఐలమ్మ సోమయ్య దంపతులకు ఇద్దరు కుమారులు ఒక కూతురు ఉండగా, వీరి ముగ్గురి పెళ్లిలు అయ్యాయి.
తల్లి ఐలమ్మ, తమ కులవృత్తి అయినటువంటి గంపలు అల్లికలు పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆమె పెద్ద కుమారుడు శ్రీకాంత్ (34) కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా మధ్యానికి బానిసైన శ్రీకాంత్ డబ్బు కోసం తల్లితో తరచూ గొడవపడేవాడని, డబ్బులు ఇవ్వకపోవడంతో కిరాతకుడిగా మరిన కొడుకు, తల్లిని ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. దీంతో రక్తపు మడుగులో పడిఉన్న ఐలమ్మ ను గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందినట్లు తెలిపారు. కాగా పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.