calender_icon.png 4 October, 2025 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏండ్లు గడుస్తున్న ఎస్సీ రిజర్వేషన్ అవకాశం కల్పించరా..?

04-10-2025 03:19:38 PM

సిద్దిపేట/కోహెడ,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాల గ్రామంలో దళిత కుటుంబాలు దాదాపు 70 ఇండ్లు ఉంటాయి. జనాభాపరంగా చూసుకుంటే 500 మంది ఉంటారు. ఓటర్లుగా చూసుకుంటే 300 ఓటర్లు ఉంటారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నప్పుడు రొటేషన్ పద్ధతిలో చూసుకున్నా గాని మండల యూనిట్ గా చూసుకున్నా గాని ఈ గ్రామానికి అసలే రిజర్వేషన్ అవకాశం రాలేదు 1954 నుండి 1965 వరకు 10 సంవత్సరాలు (జనరల్)గా కేటాయించారు. 1965 నుండి 1981 వరకు 16 సంవత్సరాలు (జనరల్)గా కేటాయించారు.

1981 నుండి 2001 వరకు 20 సంవత్సరాలు (జనరల్)గా కేటాయించారు. 2001 నుండి 2006 వరకు ఐదు సంవత్సరాలు (బీసీ మహిళ)గా కేటాయించారు. 2006 నుండి 2011 వరకు 5 సంవత్సరాలు (బీసీ జనరల్) గా కేటాయించారు. 2011 నుండి 2013 వరకు స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగింది. 2013 నుండి 2018 వరకు 5సంవత్సరాలు (జనరల్ )గా కేటాయించారు. 2018 నుండి 2023 వరకు 5 సంవత్సరాలు (బీసీ మహిళ) గా కేటాయించారు. 2023 నుండి 2025 వరకు స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుంది. ప్రస్తుతం 2025లో డ్రా పద్ధతిన (జనరల్)గా కేటాయించారు.

కోహెడ మండలాన్ని సిద్దిపేట జిల్లాలో కలిపిన గానీ ఈ సముద్రాల గ్రామానికి ఎలాంటి ఎస్సి రిజర్వేషన్ అవకాశము రాలేదు. దళితులు ఓట్లు వేయడానికే పనికి వస్తారా రిజర్వేషన్ అవకాశము కల్పిస్తే దళితులు పోటీచేస్తారని పోటీ చేయకుండా ఈ గ్రామానికి ఎస్సీ రిజర్వేషన్ కల్పించడం లేదా ? ఈ గ్రామానికి ఎందుకు ఎస్సీ రిజర్వేషన్ అవకాశం కల్పించడం లేదు పునర్ పరిశీలన చేసి ఈ గ్రామానికి ఎస్సీ రిజర్వేషన్ అవకాశం కల్పించాలని అంబేద్కర్ సంఘం మాజీ అధ్యక్షులు ప్రస్తుత గౌరవ అధ్యక్షులు చింతకింది సింగరయ్య అధికారులను కోరుచున్నారు.