calender_icon.png 4 October, 2025 | 6:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీమిండియా వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్

04-10-2025 03:00:14 PM

అహ్మదాబాద్‌: టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నియమితులయ్యారు. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ లో పురుషుల 50 ఓవర్ల జట్టుకు రోహిత్ శర్మ స్థానంలో శుభ్‌మన్ గిల్ ను బీసీసీఐ కెప్టెన్‌గా నియమించింది. శనివారం అహ్మదాబాద్‌లో సెలెక్టర్ల చైర్మన్ అజిత్ అగార్కర్ అధ్యక్షతన జరిగిన ఎంపిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 19 నుండి ఆస్ట్రేలియాలో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో గిల్ భారత జట్టు‌కు నాయకత్వం వహించానున్నారు. ఫిబ్రవరి ప్రారంభంలో భారత్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ విజయాన్ని అందించిన రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు రాబోయే వన్డే సిరీస్ కోసం జట్టులో చేరనున్నారు.

2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ తర్వాత రోహిత్, కోహ్లీ ఇద్దరూ మొదటిసారి పోటీ క్రికెట్‌లోకి తిరిగి వస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో టెస్టులో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన శుభ్‌మన్ గిల్‌ను భారత జట్టుకు అన్ని ఫార్మాట్‌లలోనూ కెప్టెన్‌గా చూస్తున్నారు. ఐపీఎల్ సీజన్ మధ్యలో రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్ నుండి రిటైర్ అయిన తర్వాత ఆతని స్థానంలో గిల్ టెస్ట్ కెప్టెన్‌గా నియమితులయ్యారు. శుభ్‌మన్ నాయకత్వంలో భారతదేశం ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీని 2-2తో డ్రాగా ముగించింది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో తన ప్రదర్శనతో విమర్శకుల నోళ్లు మూయించారు.