calender_icon.png 19 May, 2025 | 11:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరసమెన ధరలతోనే మేలు

12-03-2025 12:00:00 AM

యచ్ఛపణ్యం ప్రచురం 

తదేకీకృత్య అర్ఘమారోపయేత్

ప్రాప్తే అర్ఘే వా 

అర్ఘాంతరం కారయేత్‌॥

 కౌటిలీయం: -(2

“ఎక్కువ మొత్తంలో ఫణ్యాన్నంతటినీ (అమ్మదగింది) ఒకచోట చేర్చి దాని ఖరీ దు పెంచాలి. అనుకున్న ధర వచ్చిన తరువాత దానికి మరొక మూల్యాన్ని నిర్ణయిం చాలి (తగ్గించాలి)” అంటున్నాడు చాణక్య. వస్తు వినిమయం అధికంగా ఉండి సరఫరా తక్కువగా ఉంటే ధరలు హెచ్చుగా ఉంటాయి. వస్తు వినిమయం తక్కువగా ఉండి సరఫరా అధికంగా ఉంటే ధరలు తగ్గుతాయి.

వ్యాపారంలో ముడిసరకులను సేకరిం చి ఉత్పత్తులుగా మార్చడం, వాటిని జాగ్ర త్త చేయడం, వివిధ ప్రాంతాలకు రవాణా చేయడం, పంపిణీదారుకు, టోకు కొనుగోలుదారులకు, చిల్లర వ్యాపారులకు అం దించడం, వినియోగదారునికి చేర్చడం అ నే ప్రక్రియలన్నిటినీ ‘సరఫరా క్రమం’ అం టారు.

వివిధ విభాగాలలో జరిగిన ఉత్పత్తులకు అమ్మకపు వెలను నిర్ణయించే విధానంలో సరఫరా క్రమంలో ఎవరెవరి లాభాలు ఎంతనే అంశానికి తోడుగా ఉ త్పత్తి నాణ్యత, అదే ఉత్పత్తికి పోటీ సంస్థల అమ్మకపు ధరలు ప్రభావాన్ని చూపుతా యి.

వివిధ విభాగాలను ప్రతిభావంతంగా సమన్వయం చేయడం, సరైన సమయానికి వినియోగదారుని వద్దకు చేర్చడం వంటివన్నీ సంస్థ ప్రభావవంతమైన పనితీరుకు దర్పణంగా నిలుస్తాయి. ఇదే వారి లో నమ్మకాన్నీ పెంచుతుంది. అయితే, “అనుకున్న లాభాలు గడించిన పిమ్మట ఉత్పత్తుల ధరను తగ్గించాలి” అనే చాణక్యుని నియమాన్ని ఈనాటి వ్యాపారస్థులు పాటించడం అరుదుగా కనిపిస్తుంది.

అవసరాలు, ప్రాధాన్యాతల గుర్తింపు

నాణ్యతా విలువలను పాటిస్తూ ప్రభావవంతంగా వినియోగదారునికి సేవలం దించే సంస్థ రెండు ముఖ్యమైన అంశాలపై దృష్టిని కేంద్రీకరిస్తుంది. అందుబా టులోని వనరులను ప్రాధాన్యతా క్రమం లో ఆయా విభాగాలకు కెటాయించడం, యోగ్యతనుబట్టి వ్యక్తులకు కీలక బాధ్యత ల నప్పగించడం. వీటివల్ల జవాబుదారీతనంతో ఎవరి బాధ్యతలను వారు సరిగా నిర్వర్తించడంతో ఉత్పత్తులు వినియోగదారునికి సకాలంలో చేరుతాయి.

అవాంఛనీ య ఒత్తిడీ తగ్గుతుంది. ముడి సరుకులను సేకరించి, ఉత్పత్తులుగా మార్చి, వాటిని వినియోగదారుని వద్దకు చేర్చేంత వరకు వ్యవస్థలన్నింటికీ సుమారు 5 నుంచి 70 శాతం పైన లాభాలు చేరుతాయి. పరిశ్ర మ బ్రాండు విలువ, ఉత్పత్తి నాణ్యత, మా ర్కెట్ పరిస్థితులను అనుసరించి లాభాల శాతం మారవచ్చు.

అయితే, కొన్ని పెద్ద సంస్థలు నేరుగా ఉత్పత్తిదారుని వద్ద కొనుగోలు చేస్తూ, మధ్యదళారుల లాభాలను వినియోగదారునికి అందిస్తాయి. దాంతో వారి అమ్మకాలు పెరుగుతాయి, వినియోగదారుడూ లాభపడతాడు.

ఈ క్రమంలో రిటైల్ రంగంలో ఉత్తమ ఫలితాలను సాధించి క్రమంగా నష్టాలను చవిచూసిన ‘ఫ్యూచర్ గ్రూప్’ సంస్థ ఉత్థాన పతనాలను పరిశీలించినప్పుడు పలు విష యాలు మనకు అర్థమవుతాయి. పంట్లో మ్స్ పేరుతో 1997లో ఆరంభమైన ఈ సంస్థ వ్యాపార ప్రస్థానం భారతదేశంలోని ప్రముఖ నగరాలన్నింటిలో బిగ్‌బజార్ లాంటి పలు విభాగాలలో దాదాపు 1700 రిటైల్ దుకాణాలను నెలకొల్పి, చివరగా 947 దుకాణాలను రిలయన్స్ సంస్థకు అమ్ముకోవలసి వచ్చింది. భారతదేశంలోనే రిటైల్ రంగంలో మార్గదర్శిగా పేరొందిన ఈ గ్రూప్ నష్టాలకు దారి తీసిన పరిస్థితులు ఇక్కడ గమనార్హం. 

ఒక దానికి మరొక దానికి సంబంధం లేని రంగాలలో అనుభవం లేకున్నా దూ కుడుగా వ్యాపారాన్ని విస్తరించడం, అలా గే పద్ధతి ప్రకారం విస్తరిస్తున్న డీ మార్ట్, ఈ కామర్స్‌లో అగ్రగాములైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి సంస్థలకు పోటీగా నిలువలేక పోవడం.. వంటి కారణాలు ప్రధా నంగా కనిపిస్తాయి. నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఫ్యూచర్ గ్రూప్‌ను రిలయన్స్ సంస్థ కొనుగోలు చేసింది. అయితే, అంతకు ముందే అమెజాన్ సంస్థతో చేసుకున్న ఒప్పందాలు ఫ్యూచర్ గ్రూప్‌ను న్యాయ వివాదాల్లోకి నెట్టివేసాయి. 

ముగ్గురూ లాభపడే మార్గం

ఉత్తమ ఫలితాలను సాధిస్తున్న డీ మా ర్ట్ సంస్థ పనితీరును పరిశీలిద్దాం. భారతీయ రిటైల్ మార్కెట్ రంగంలో 2002 లో అడుగుపెట్టిన డీ మార్ట్ రిటైల్ వ్యాపారానికి దిక్సూచిగా ఎదగగలిగింది. ఇప్పటి వరకది దేశంలోని వివిధ ప్రాంతాలలో 381 స్టోర్స్ తెరిచింది. మధ్యతరగతి, ఎగు వ మధ్యతరగతి వారిని లక్ష్యంగా భరించగలిగిన ధరలకు, నాణ్యమైన ఉత్పత్తులను విక్రయిస్తూ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నది.

ఒకే కప్పుకింద అందరికీ అవసరమైన అన్ని వస్తువులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా అందిస్తూ, అధిక వినియోగదారులను ఆకర్షించగలుగుతున్నది. ఇంకా, నవ్యతను కోరుకునే యువ తను, అనుకూలమైన సమయంలో కొనుగోలు చేయాలనుకునే ఉద్యోగులను, నా ణ్యమైన ఉత్పత్తులను సరసమైన ధరలో పొందాలనుకునే వృద్ధులను ఆకర్షిస్తూ, వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నది.

నిర్వహణా వ్యయాన్ని తగ్గించుకునేందుకు ము ఖ్యమైన కూడళ్లలో స్థలాలను కొని, తనకు అవసరమైన విధంగా భవనాలు నిర్మించుకోవడం వల్ల కిరాయిల భారం పడకుండా జాగ్రత్త పడుతున్నది. ప్రభుత్వ చట్టాలను గౌరవించడం, నాణ్యత పట్ల నిబద్ధత, వినియోగదారుల సూచనలను పరిగణిస్తూ మార్పులు చేసుకోవడం వల్ల వ్యాపార విస్తరణ సాధ్యమయింది. నేరుగా ఉత్పత్తిదారులతో, సరఫరాదారులతో బేరమాడు తూ తక్కువ ధరలకు ఒప్పందాలు కుదుర్చుకోవడమూ ఒక మేలైన పద్ధతిగా చె ప్పాలి.

వినియోగదారులకు మార్కెట్ ధరకన్నా తక్కువ ధరలకు ఉత్పత్తులను అం దించడం ద్వారా పై సంస్థ తన స్థానాన్ని నిలుపుకుంటున్నది. దానితో సరఫరాదారుకు ముఖ్యమైన స్థలాలలో తమ ఉత్ప త్తులను ప్రదర్శించే అవకాశం వస్తుంది.

దీనినే ‘వెండార్ ఫండింగ్’ అంటారు. దీనితో ఉత్పత్తిదారు, వినియోగదారు, సం స్థ ముగ్గురూ లాభపడతారు. ముగ్గురి మ ధ్య దీర్ఘకాలిక అనుబంధమూ ఏర్పడుతుంది. వినియోగదారుని అవసరాలకు అనుగుణంగా, నాణ్యమైన ఉత్పత్తులను, సరసమైన ధరలకు అందించడం వల్ల వ్యా పార ప్రస్థానం సజావుగా జరుగుతుంది.

 పాలకుర్తి రామమూర్తి