calender_icon.png 20 May, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి యాజమాన్యంతో రూ.167.70 లక్షలకు ఎంఓయు

19-05-2025 11:17:56 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ సింగరేణి యాజమాన్యం మణుగూరు వారితో సోమవారం రూ 167.7 లక్షలకుగాను ఎంఓయు చేయడం జరిగింది. దీంతో మణుగూరులోని కోడిపుంజుల వాగు, సమితి సింగారం చెరువు, పొడ పొట్రాల చెరువు, ఎర్ర లక్ష్మయ్య కుంట పూడికతీత పనుల నిర్వహించనున్నారు. తద్వారా వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో వరద ముంపుకు గురికాకుండా మణుగూరు పరిసర ప్రాంత ప్రజలను ఈ కార్యక్రమం ద్వారా సురక్షితముగా ఉంచవచ్చు. చెరువులను డిసిల్టింగ్ చేయటం మూలంగా చెరువుల్లో ఎక్కువ నీటిని నిల్వ చేయుటకు అన్ని రకాలైనటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇట్టి సదవకాశాన్ని మణుగూరు ప్రాంత ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కలెక్టర్ జితేష్ వి పాటిల్(Collector Jitesh V Patil) తెలియపరిచినారు. ఈ కార్యక్రమంలో మణుగూరు ఏరియా సింగరేణి యాజమాన్యం సిపిఓ సంజీవరావు పాల్గొన్నారు.