calender_icon.png 20 May, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుష్ప్రభావాలకు దూరంగా!

12-03-2025 12:00:00 AM

శరీరానికి సహజ రక్షణ కవచంగా యాంటీ ఆక్సిడెంట్లు (దుష్ప్రభావ నిరోదకాలు) పనిచేస్తాయి. ఇవి కణ శనాన్ని తగ్గించి, రోగ రోధకశక్తిని పెంచుతాయి. విటమిన్ ఎ, సీ, ఈ, సెలీనియం, జింక్, ఫ్లావ నాయిడ్లు, పోలీఫెనాల్స్ వంటి పదార్థాలు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. గుండె సంబంధ వ్యాధులను నివారించడం లో సహాయ పడతాయి.

మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరిచి మతిమరుపును తగ్గిస్తాయి. వయస్సు పెరుగుతున్నప్పుడు కనిపించే వృద్ధాప్య లక్షణాలను ఆలస్యపరిచే గుణం వీటిలో ఉండడం విశేషం. యాంటీ ఆక్సిడెంట్లను సహజంగా పొందాలంటే సరైన ఆహా రపు అలవాట్లు ఉండాలి. మామిడి, నేరేడు, ద్రాక్ష, అనాసపండు, బొప్పాయి, నారింజ వంటి పళ్లలో ఇవి సమృద్ధిగా లభిస్తాయి. పాలకూర, మెంతికూర, బచ్చలి వం టి ఆకుకూరలు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలి గి ఉంటాయి.

బాదం, వాల్నట్, సన్‌ఫ్లవర్ సీ డ్స్, ఫ్లాక్స్ సీడ్స్ వంటి గింజలు శరీరానికి శక్తినిచ్చే పోషకాలతోపాటు దుష్ప్రభావ నిరోద కాలనూ అందిస్తాయి. గ్రీన్ టీ, పచ్చి టీ, అలాగే డార్క్ చాక్లెట్ వంటి ఆహార పదార్థా లు శరీరాన్ని రక్షించే లక్షణాలతో మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ల ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే ప్రా సెస్డ్ ఫుడ్, అధిక చక్కెర, ఎక్కువ ఉప్పు కలిగిన ఆహారాలను తగ్గించుకోవడం అవసరం. 

 డా. కృష్ణకుమార్ వేపకొమ్మ