calender_icon.png 20 May, 2025 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాసన్ ఐ కేర్ సూపర్ స్పెషాలిటీ అధునాతన సేవలు..

19-05-2025 10:42:14 PM

హనుమకొండ (విజయక్రాంతి): తెలంగాణలోని సూపర్ స్పెషాలిటీ వాసన్ ఐ కేర్ హాస్పిటల్(Vasan Eye Care Hospital) అని భారతదేశంలోని 83 నగరాల్లో 176 శాఖలను కలిగి ప్రజలకు సేవచేస్తూ మరింత దగ్గర అయ్యామని చీఫ్ సర్జన్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రతన్ కుమార్(Dr. Ratan Kumar) అన్నారు. సోమవారం హనుమకొండలో పునఃప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాటాడుతూ... వరంగల్, హనుమకొండ పట్టణ వాసులు కంటి సమస్యతో బాధపడుతూ హైద్రాబాద్ నగరం వరకు పోవాల్సిన అవసరం లేదని కంటి సమస్యలకు నిపుణ వైద్య బృందం అన్ని పరీక్షలు నిర్వహించి తక్కువ ఖర్చుతో అధునాతన వైద్యం అందించుటలో ముందు ఉంటామన్నారు.

కంటిశుక్లం, గ్లాకోమా, లాసిక్, డయాబెటిక్ రెటినోపతి, ఓక్యులోప్లాస్టిక్ సమస్యలు, కార్నియల్ వ్యాధులు, మెల్లకన్ను, పీడియాట్రిక్ ఆప్తాల్మాలజీ, న్యూరో-ఆఫ్తాల్మాలజీ, అంబ్లియోపియా ఒకే రూఫ్ కింద ఉన్న కంటికి సంబంధించిన అన్ని చికిత్సలతో సహా అనేక రకాల కంటి పరిస్థితులను నిర్ధారించడానికి, చికిత్స చేయడానికి ఆసుపత్రి సన్నద్ధమైందని ఆయన చెప్పారు. ఉచిత కంటిశుక్లం స్క్రీనింగ్, మూల్యాంకన విలువ 5000 రూపాయలు  నేటి నుండి ఒక నెల పాటు ఉచిత కన్సల్టేషన్ అందించనున్నట్లు తెలిపారు.

వరంగల్ వాసన్ ఐ కేర్ హాస్పిటల్‌లో 6 మంది వైద్యులతో కూడిన వైద్య బృందం ఉందని డాక్టర్ సర్దార్ ఖాన్ ఎండి, కన్సల్టెంట్-గ్లాకోమా, క్యాటరాక్ట్ సర్జన్, డాక్టర్ రాజ్ కుమార్ -సీనియర్ కన్సల్టెంట్, డాక్టర్ వెంకట్ రామ్ నర్సయ్య సీనియర్ కన్సల్టెంట్, డాక్టర్ ప్రమీట్ కాన్సల్టెంట్, డాక్టర్ ఉదిత్ అజ్మానీ విట్రియో రెటినా, క్యాటరాక్ట్ సర్జన్, డాక్టర్ ఖలీద్ లతీఫ్ - సీనియర్ క్యాటరాక్ట్ సర్జన్ ప్రతి రోజు అందుబాటులో ఉంటారని తెలిపారు. పూర్తి సమాచారం కోసం గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్, లష్కర్ బజార్, హన్మకొండ, వాసన్ ఐ కేర్ హాస్పిటల్ +91-9360946159 ద్వారా సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డా. సర్దార్ ఎండి ఖాన్, డాక్టర్ వెంకట్ రామ్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.