19-05-2025 11:00:09 PM
పెద్దపల్లి జిల్లాలో మద్యం వ్యాపారుల నిలువ దోపిడి..
పెద్దపల్లి (విజయక్రాంతి): పాత సీసాలో కొత్త సారా అన్న సామెతగా... పెద్దపల్లి జిల్లాలో మద్యం వ్యాపారులు(Liquor Traders) పాత స్టాక్ ని కొత్త ధరలకు అమ్ముతూ వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మద్యం రేట్లను పెంచుతుంది అన్న విషయం ముందే లీక్ కావడంతో గత రెండు రోజుల కిందటే జిల్లాలోని రామగుండం, పెద్దపల్లి, మంథని ప్రాంతాలలోని మద్యం వ్యాపారులు పెద్ద మొత్తంలో మద్యం దిగుమతి చేసుకున్నారు. రెండు రోజులుగా వినియోగదారులను నో స్టాక్ అంటూ తిప్పి పంపించిన వ్యాపారులు అదే పాత మధ్యలో తెలంగాణ ప్రభుత్వం పెంచిన కొత్త ధరలకు వినియోగిస్తున్నారు.
ఈ విషయమై రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పలు మద్యం దుకాణాల వద్ద వినియోగదారులు వ్యాపారులను ఇలా చేస్తున్నారు. ఎక్సైజ్ నిబంధన ప్రకారం కొత్త స్టాకు వచ్చాక నూతన ధరలకు విక్రయించాల్సి ఉంది. అయితే పెద్దపల్లి, మంథని, రామగుండంలో ఎక్సైజ్ పోలీసులు, మద్యం వ్యాపారుల మధ్య ఉన్న సత్సంబంధాలను ఆసరాగా చేసుకొని వ్యాపారులు పాత స్టాకు ఉన్న మద్యం ను కొత్త ధరలకు అమ్ముకుంటూ వినియోగదారులను ఆర్థిక దోపిడికి గురి చేస్తున్నారు. ఇందులో నుంచి ఎక్సైజ్ పోలీసుల వాటా కూడా వారికి సక్రమంగానే అందుతున్నట్లు తెలిసింది. లేకుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.