19-05-2025 11:12:43 PM
సిపిఐ శతవసంతాల వేడుకలను గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలి..
సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా(CPI District Secretary SK Sabir Pasha) పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక చండ్ర రాజేశ్వరరావు భవన్ లో సీపీఐ ముఖ్యకార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మండలంలోని ప్రతి పంచాయతీలో సిపిఐ ప్రాతినిధ్యం ఉండే విధంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు రచించి ఎన్నికలకు సంసిద్ధం కావాలని, పార్టీని మరింత విస్తరించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. డిసెంబర్ 26 నాటికి పార్టీ వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో గ్రామ గ్రామాన వందేళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహించి పార్టీ చరిత్రను, త్యాగాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రతి గ్రామం, బస్తీలో ఉత్సవాలు ఘనంగా జరిగేలా ప్రణాళిక రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
పాల్వంచ ప్రాంత సమగ్ర అభివృద్ధిపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు ప్రత్యేక ద్రుష్టి సారించారని, ఇప్పటికే వివిధ పథకాలతో రోడ్లు, డ్రైన్లు, నీటి పథకాలు శరవేగంగా పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగిలిన పనులు త్వరలో ప్రారంభం అవుతాయన్నారు. ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని తెలిపారు. నిమ్మల రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, సీపీఐ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, పట్టణ కార్యదర్శి అడుసుమిల్లి సాయిబాబా, సిపిఐ మండల సహాయ కార్యదర్శి గుండాల నాగరాజు, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఉప్పు శెట్టి రాహుల్, నాయకులు ఇట్టి వెంకట్రావు, కొంగర అప్పారావు, వేములపల్లి శ్రీనివాసరావు, ఆవుల సతీష్, వర్క అజిత్, బానోత్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.