02-10-2025 01:09:53 AM
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డియర్‌నెస్ అలవెన్స్(డీఏ)ను 55 శాతం నుంచి 58 శాతానికి పెంచుతూ కేంద్ర క్యాబినేట్ నిర్ణ యం తీసుకున్నది. ఈ నిర్ణయంతో ఏడాది జూలై 1 నుంచే వర్తిస్తుందని స్పష్టం చేసిం ది. దీంతో ఉద్యోగులకు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల బకాయిలు (ఎరియర్స్) అక్టోబర్ నెల వేతనంతో కలిపి జమవుతా యి.
ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో కేంద్ర క్యాబినెట్ పలు అంశాలకు ఆమోదం తెలిపింది. డీఏ పెంపు నిర్ణయంతో దేశవ్యాప్తం గా 33 లక్షల మంది ఉద్యోగులు, 66 లక్షల మంది.. మొత్తం 99 లక్షల మందికి పైగా లబ్ధిచేకూరనున్నది. తాజాగా నిర్ణయంతో వారి ఖాతాల్లో సుమారు రూ.10,084 కోట్లు అదనంగా జమ అవుతాయని కేంద్ర ప్రసార శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
దీపావళి సమయం లో క్యాబినెట్ నిర్ణయం ఊరటనిస్తుందని అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణ ప్రభావం నుంచి ఉద్యోగులను తప్పించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకున్నదని తెలిపారు. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ (సీపీఐ-ఐడబ్ల్యూ) ఆధారంగా కేంద్రం డీఏను లెక్కించి, ఏటా జనవరి, జూలైలో డీఏను సవరిస్తుంది.
లేబర్ బ్యూరో ప్రతి నెలా విడుదల చేసే ఇండెక్స్ 12 నెలల సగటు తీసి, 7వ వేతన కమిషన్ ఫార్ములా ప్రకా రం లెక్కింపు జరుగుతుంది. కేంద్రం డీఏను సవరించిన నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వాలు సైతం తమ ఉద్యోగులకు అదే మేరకు డీఏ పెంచే అవకాశం ఉంటుంది.
దేశవ్యాప్తంగా కొత్త కేంద్రీయ విద్యాలయాలు
దేశంలోని 20 జిల్లాల్లో కొత్తగా 57 కేంద్రీయ విద్యాలయాల స్థాపనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వాటి నిర్మాణానికి కేంద్రం రూ.5,863 కోట్లు కేటా యించింది. వీటిలో ఏడు విద్యాలయాల ను కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్మిస్తుండగా, మిగిలిన 50 విద్యాలయాలను రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్రం నెలకొల్పనున్నది. అలాగే ఆత్మ నిర్భర భారత్‌లో భాగంతా పప్పు దినుసుల ఉత్పత్తిలో స్వయం సంమృద్ధికి రూ.11,440 కోట్లు కేటాయించింది.
కేంద్రం ఈ మొత్తాన్ని నాణ్యమైన విత్తనాల తయారీ, శిక్షణ, మౌలిక వసతుల పెంపు, పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెంపు, ధర స్థిరీకరణ నిధికి ఖర్చు చేయనుంది. యాసంగిలో పంట దిగుబడులకు మద్దతు ధరలకూ వెచ్చించనున్నది. కలియబోర్ నుంచి నుమాలీఘర్ సెక్షన్ మధ్య జాతీయ రహదారి నిర్మాణానికి రూ.6,957 కోట్లు విడుదల చేస్తున్నట్లు క్యాబినెట్ తెలిపింది. బయో మెడికల్ రీసెర్చ్ కెరీర్ ప్రోగ్రాం ఫేజ్| 3కి ఆమోదం తెలిపింది. ప్రాజెక్టుకు కేంద్రం రూ.1,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. వందేమాతర గేయం 150 ఏళ్ల ఉత్సవాలకూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.