calender_icon.png 13 October, 2025 | 2:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చుక్కల మందుకు చక్కని స్పందన

13-10-2025 12:31:31 AM

ముషీరాబాద్, అక్టోబర్ 12 (విజయక్రాంతి): ముషీరాబాద్‌లో పల్స్ పోలియో కార్యక్రమానికి చక్కని స్పందన లభించింది. ముషీరాబాద్‌లోని రాంనగర్, భోలక్‌పూర్, గాంధీనగర్, ముషీరాబాద్, కవాడిగూడ, అడిక్మెట్ డివిజన్ లలోని ఆదివారం చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

పోలి యో రహిత సమాజ స్థాపనకు 5సంవత్సరాల లోపు చిన్నారులకు తప్పనిసరి పోలి యో చుక్కల మందు వేయించాలని ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ పేర్కొన్నారు. పల్స్ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకొని భోలక్ పూర్ ముషీరాబాద్ లో చిన్నారులకు పోలియో చుక్కల మందు వేశారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ ముషీరాబాద్ లోని భరత్ నగర్ లో చిన్నారులకు చుక్కల మందు వేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కంచి ముదిరాజ్, నాయకులు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముషీరాబాద్ ప్రభు త్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ మనోజ్ రెడ్డి చిన్నారులకు చుక్కల మందు వేశారు.

భోలక్ పూర్ లో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు అక్లక్ హుస్సేన్, 5సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కల మందు వేశారు. రంగానగర్లో బీఆర్‌ఎస్ భోలక్పూర్ డివిజన్ అధ్య క్షుడు వై.శ్రీనివాసరావు చిన్నారులకు పోలియో చుక్కల మందు వేశారు.