calender_icon.png 13 October, 2025 | 4:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లికార్జున్ ఖర్గేను పరామర్శించిన మహేష్ గౌడ్

13-10-2025 02:26:47 PM

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Goud) సోమవారం పరామర్శించారు. మల్లికార్జున ఖర్గే ఆరోగ్య పరిస్థితిని హషేశ్ గౌడ్ అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు, హైకోర్టు స్టే గురించి ఖర్గేకు వివరించినట్లు ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్తున్నామనే విషయం కూడా చెప్పినట్లు సూచించారు. వీలైనంత త్వరగా సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం అప్పీల్ చేస్తుందని వెల్లడించారు. కాంగ్రెస్ నేతలు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని స్పష్టం చేశారు. మంత్రులు పోన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌ మధ్య వివాదాలు చిన్ని చిన్న అంశాలన్నారు. సమాచార లోపం వల్లే మంత్రుల మధ్య వివాదాలు జరిగాయని వెల్లడించారు. మంత్రుల మధ్య వివాదాలు చర్చించి పరిష్కరించుకుంటామని మహేశ్ గౌడ్ వివరించారు.