calender_icon.png 11 May, 2025 | 5:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఆరోగ్య పాఠశాల’తో మంచి ఫలితాలు

06-05-2025 12:00:00 AM

ఆదిలాబాద్, మే 5 (విజయక్రాంతి): అందరి సహకారంతో పదవ తరగతి పరీక్ష ఫలి తాల్లో 97.18 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయి లో జిల్లా 9వ స్థానం నిలిచిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదిలా బాద్‌లోని జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం  పదో తరగతి, ఇంటర్ ఫలితా ల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల ను  కలెక్టర్ సన్మానించి, అభినందించారు.

పాఠశాలల్లో ఇటీవల నిర్వహించిన ఆరోగ్య పాఠశాల కార్యక్రమంతో మంచి ఫలితాలు వచ్చాయని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమం లో డీఈఓ శ్రీనివాస్, ఇంటర్మీడియట్ అధికారి గణేష్, వెల్ఫేర్ హాస్టల్ ప్రిన్సిపల్స్, విద్యార్ధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయు లు, తదితరులు పాల్గొన్నారు.