16 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ సలహాదారు
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయములో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్(Government Advisor Mohammed Ali Shabbir) కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను దాదాపు 16 లక్షల రూపాయలు శనివారం లబ్దిదారులకు పంపిణి చేశారు. ఈ సందర్భంగా అలీ షబ్బీర్ మాట్లాడుతూ... కామారెడ్డి నియోజకవర్గంలోనీ పలు గ్రామాలలోని బాధితులకు సీఎం సహాయనిధి నుండి నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. అనారోగ్యంతో అప్పుల పాలైన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తాయన్నారు.
పేదలకు సహాయంగా అండగా నియోజకవర్గ ప్రజల మంచి మాత్రమే కోరుకుంటామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మరియు కొత్త రేషన్ కార్డులు అర్హులకు అందిస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే అమలు చేస్తున్నాం. రుణమాఫీ చేసి చూపించాం రైతు భరోసా అందిస్తున్నాం మహిళలకు ఉచిత బస్సు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకము ద్వారా నిరుద్యోగ యువతి యువకులు ఉపాధి పొందచ్చు అన్నారు. భూభారతి ద్వారా రైతుల సమస్యలు శాశ్వతంగా తొలిగిపోతాయి అని పేర్కొన్నారు.






