calender_icon.png 18 November, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ప్రభుత్వ సలహాదారులు పోచారం

18-11-2025 08:15:41 PM

బాన్సువాడ (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లారుద్రుర్ మండలం రానంపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం  శ్రీనివాస్ రెడ్డి ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ లు ప్రత్యేక పూజలు చేపట్టి భూమి పూజ చేపట్టారు. ఈ సందర్భంగా  రూ. 50లక్షల రూపాయలతో రాణంపల్లి నుండి లింగంపల్లి వరకు మెటల్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.

అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులు  కాసుల అంజవ్వ హన్మండ్లు  ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి భూమి పూజ చేసి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో గల శ్రీ సాయి అయ్యప్ప మందిరం మొదటి వార్షికోత్సవానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి తో పాటు కాసుల బాలరాజు హాజరై ప్రత్యేక పూజలు  చేశారు.ఈ కార్యక్రమంలో వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ సురేష్ బాబా మండల ప్రజాప్రతినిధులు నాయకులు , కోటగిరి మండల ప్రజాప్రతినిధులు నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.