calender_icon.png 18 November, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎరువుల దుకాణంలో ధరల సూచిక ఏర్పాటు చేయాలి

18-11-2025 08:13:08 PM

విత్తనాలు అధిక ధరలకు అమ్మవద్దు..

ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేసిన ఎల్లారెడ్డి ఎడీఎ..

గాంధారి (విజయక్రాంతి): ఎరువుల దుకాణాలలో ధరల సూచికాలు ఏర్పాటు చేయాలని ఎల్లారెడ్డి ఎడీఎ సుధ మాధురి అన్నారు. మంగళవారం గాంధారి మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాలను మండల వ్యవసాయ అధికారి రాజలింగంతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ దుకాణాలలో నిల్వ ఉన్నటువంటి ఎరువుల వివరలను అడిగి తెలుసుకున్నారు. విత్తనాల, నిల్వల రిజిస్టార్ లను తనఖీ చేసారు. ఈ సందర్బంగా ఎడిఏ సుధ మాధురి మాట్లాడుతూ మండలంలోని రైతులకు విత్తనాలు అధిక ధరలకు అమ్మవద్దని అన్నారు. విత్తనాలు, ఎరువులు కొరత సృష్టించకుండా సకాలంలో రైతులకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజలింగం, ఫర్టిలైజం దుకాణాల యజమానులు పాల్గొన్నారు.