calender_icon.png 12 July, 2025 | 2:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల వైద్యానికి సర్కారు భరోసా

12-07-2025 12:00:00 AM

ఎమ్మెల్యే కాలె యాదయ్య

చేవెళ్ల, జులై 11:కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే స్థోమత లేని పేదలకు ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్ ద్వారా భరోసా ఇస్తోందని ఎమ్మెల్యే కాలె యాదయ్య స్పష్టం చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన రూ. 23,80,500 విలువైన 52 చెక్కులు, అత్యవసర చికిత్స కింద మహ్మద్ గోరిబి , మహ్మద్ గౌస్ కుటుంబసభ్యులకు రూ. 5 లక్షల ఎల్ వోసీ అందజేశారు. 

అనంతరం ఇందిరమ్మ మహిళా శక్తి , రేవంతన్న భరోసా పథకం కింద 21 మంది మైనార్టీ మహిళకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. అలాగే కులాంతర వివాహం చేసుకున్న నవాబు పేట మండలం ముభారక్ పూర్ గ్రామానికి చెందిన మేకల శ్రీకాంత్ ,- సాయి హర్షితకు రూ.2.50 లక్షల విలువైన కల్యాణ లక్ష్మి చెక్కుఅందజేశారు.