12-07-2025 02:12:38 PM
రంగారెడ్డి,(విజయక్రాంతి): పోస్ట్ కార్డు ఉద్యమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kalvakuntla Kavitha) తెర లేపారు. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా మహిళలకు అభయ హస్తంతో ఆర్థిక భరోసా అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీ ఇచ్చి మరిచిందని... ఈ అంశాలపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి(Sonia Gandhi) కల్వకుంట్ల కవిత పోస్ట్ కార్డు ద్వారా లేఖను పంపారు.. వివరాల్లోకెళ్తే.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం లో శనివారం ఆమె పర్యటించారు. కాకునూరు గ్రామంలో నుంచి ఆమె "పోస్ట్ కార్డ్" ఉద్యమానికి తెర లేపినట్లు తెలుస్తోంది.
2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 'అభయహస్తం' మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీల్లో భాగంగా 'మహాలక్ష్మి' పథకం కింద తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి మహిళకు నెలకు రూ.2500 ఇస్తామని మీ సమక్షంలో మీరు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట ఇచ్చి ఉన్న విషయం (సోనియా గాంధీ) మీకు విధితమే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తి కావస్తున్న... ఈ పథకం కింద నాకు ఇస్తామన్న రూ.2500 నాకు ఇప్పటి వరకు అందలేదు. ఈ పథకం కోసం నేను దరఖాస్తు కూడా చేయడం జరిగింది. ఈ పథకం పొందడానికి నాకు అన్ని అర్హతలున్నాయి. దయచేసి, మీరు తెలంగాణ ముఖ్యమంత్రికి, తెలంగాణ ప్రభుత్వానికి నాకు గత 15 నెలలుగా మహాలక్ష్మి పథకం కింద రావాల్సిన రూ.37,500 (పాత బకాయిలు) తో సహా ప్రతి నెల రూ.2500 మంజూరు చేయుటకు ఆదేశించాలని మీకు సవినయంగా కోరుతున్నానని లేఖలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కవిత ప్రస్తావించినట్టు తెలిసింది.