calender_icon.png 12 July, 2025 | 7:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగ్గురు గేదెల దొంగల అరెస్టు

11-07-2025 11:54:47 PM

42000 నగదు స్వాధీనం, రిమాండ్ కు తరలింపు 

సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): గేదెను దొంగతనం చేసిన ముగ్గురు నిందితులను ఎస్సై జె.జగన్ శుక్రవారం అరెస్టు చేశారు.నారాయణపూర్ ఎస్సై జగన్ మాట్లాడుతూ నారాయణపూర్ మండలం సర్వేలు గ్రామానికి చెందిన కారింగు యాదయ్య ఈనెల 5వ తేది శనివారం తన వ్యవస్యాయ క్షేత్రం వద్ద గేదేను కట్టివేసి ఇంటికి వచ్చాడు. మర్నాడు ఆదివారం ఉదయం బావి వద్దకు వెళ్లి చూడగా గేదే కనిపించకపోవడంతో నారాయణపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఎస్సై జగన్ మునుగోడు మండలం కొంపల్లి గ్రామానికి చెందిన వీరమల్ల శివ,చల్మెడ గ్రామానికి చెందిన గాదేపాక నరసింహ,కొప్పోల్ పరమేష్ లుగా గుర్తించారు.నిందితులు శనివారం సర్వేలు గ్రామంలో యాదయ్య వ్యవసాయ క్షేత్రం వద్ద  మద్యం సేవిస్తూ పక్కనే ఉన్న  గేదేను ఆటోలో తీసుకువెళ్ళి మల్లేపల్లి సంతలో రూ. 42000 లకు అమ్మేశారు.వచ్చిన డబ్బును జల్సాల కోసం సమానంగా పంచుకొన్నారు.శుక్రవారం ముగ్గురు నిందితులను పట్టుకొని వారి వద్ద నుండి 42000 నగదును ,సెల్ ఫోన్లు ,ఆటోను స్వాధీనం చేసుకొని వారిని రిమాండుకు పంపినట్లు ఎస్సై జగన్ తెలిపారు.