01-11-2025 01:00:19 AM
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 31 (విజయక్రాంతి) : మొంథా తుఫాన్ ప్రభావాన్ని అం చనా వేయడంలో రాష్ర్ట ప్రభుత్వం ఘోరం గా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. సీఎం, మంత్రుల మొద్దు నిద్ర వల్ల తెలంగాణలో అనేక జిల్లా లు తీవ్రంగా నష్టపోయాయని మండిపడ్డా రు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏ ర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రైతులు రేవంత్ పాలనలో నిం డా మునిగారని, ఈ వర్షాలతో పూడ్చలేని న ష్టం జరిగిందన్నారు. పరిహారం ఇవ్వాల్సి వ స్తుందని పంట నష్టం వివరాలు తక్కువ చూ పుతున్నారని ఆరోపించారు. సీఎం, మం త్రుల ఫోకస్ అంతా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పైనే ఉందని, వరదలతో నష్టపోయిన జిల్లాలను పట్టించుకోవడం లేదని విమర్శించా రు. నష్ట పోయిన పంటకు పరిహారం వచ్చేదాకా బీఆర్‌ఎస్ పోరాడుతుందని అన్నారు.