01-11-2025 12:58:22 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 31 (విజయక్రాంతి): అరచేతిలో స్వర్గం చూపి, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దోకేబాజ్ పార్టీ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామా రావు విమర్శించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్నదని, ఇందిరమ్మ రాజ్యం అంటూ పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపిందని మండిపడ్డారు. పేదల శాపాలే కాంగ్రె స్ పార్టీకి ఉరితాళ్లుగా చుట్టుకుంటాయన్నారు.
కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలంటే, ఆ జైత్రయాత్ర ఇక్కడి నుంచే ప్రారంభం కావాలని ప్రజలను ఉద్దేశించిన కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ గల్లంతుకావడం ఖాయమన్నారు. ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సు నీత తరఫున శుక్రవారం సాయంత్రం షేక్‌పేటలో నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్ ప్రసంగించారు. దోకేబాజ్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే అవకాశం జూబ్లీహిల్స్ ప్రజల చేతుల్లోకి వచ్చిందన్నారు.
మహిళలకు నెలకు రూ.2,500, పెన్షన్ రూ.4 వేలు, తు లం బంగారం, స్కూటీలు అంటూ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇవే మీ ఇవ్వకపోగా, గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కూడా కొనసాగించే తెలివి కాంగ్రెస్ నాయకులకు లేదని విమర్శించారు. తమ ప్రభుత్వంలో హైదరాబా ద్‌లో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తే, కాం గ్రెస్ ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు.
హైడ్రా పేరుతో పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారని చెప్పారు. ఈ రెండేళ్లలోనే వేల మంది పేదల ఇళ్లను నేలమట్టం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లను కూల్చడమేనా అని ప్రశ్నించా రు. ఈ పేదల శాపాలే కాంగ్రెస్‌కు ఉరితాడు లా చుట్టుకుంటాయని కేటీఆర్ హెచ్చరించారు.
రియల్ ఎస్టేట్ రంగం సర్వనాశనం..
రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత రాష్ట్రం లో రియల్ ఎస్టేట్ రంగం సర్వనాశనమైందని, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీశారని, ఆటో డ్రైవర్ల బతుకులను చిన్నాభిన్నం చేశారని విమర్శించారు. పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఉప ఎన్నికలో కాంగ్రె స్ డిపాజిట్ గల్లంతు చేస్తేనే, రాష్ట్రవ్యాప్తంగా వారు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ముందుకు వస్తారన్నారు.
కాంగ్రెస్ ప్రభు త్వం రెండేళ్లలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని విమర్శించారు. కేసీఆర్ హ యాంలో హైదరాబాద్ ప్రజలకు ఉచితంగా అందించిన 20 వేల లీటర్ల మంచినీటిని కూడా కొనసాగించలేకపోతోందని ఎద్దేవా చేశారు. తెలంగాణను అన్ని రంగాల్లో వెనక్కి నెట్టారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటలు పెట్టుబడులు పెట్టేవారిని భయపెట్టేలా ఉన్నాయని, ఇది రాష్ట్రానికి తీవ్ర నష్టమని హెచ్చరించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మాగంటి గోపినాథ్ చేసిన సేవలు మరువలేనివని, ఆయన ఆశయాలను కొనసాగించడానికి ఆయన సతీ మణి సునీతను గెలిపించాలని కోరారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలంటే, ఆ జైత్రయాత్ర ఇక్కడి నుంచే ప్రారంభం కావా లి అని కేటీఆర్ తెలిపారు.