calender_icon.png 22 October, 2025 | 10:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్తీ దవాఖానల నిర్వహణలో ప్రభుత్వం విఫలం

22-10-2025 01:38:51 AM

ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): గత ప్రభుత్వం పేద ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ప్రతి బస్తీలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ముషీరాబాద్ లోని వైఎస్‌ఆర్ పార్కు వద్ద గల ప్రభుత్వ బస్తీ దవాఖానను ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ దవాఖాన వైద్యాధికారి డాక్టర్ రేష్మ, ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి దవాఖాన లో కావల్సిన సౌకర్యాలు, మందుల కొరత, ప్రతి నెల జీతభత్యాల వివరాలు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.. అనంతరం ముఠా గోపా ల్ మాట్లాడుతూ... బస్తీ దవాఖానాలలో ప్రజలకు అవసరమైన మందుల కొరత అధికంగా ఉందని పేర్కొన్నారు. దీనితో దవా ఖానకు వచ్చే రోగులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

వైద్యులకు, సిబ్బందికి గత నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం వల్ల వారు ఆర్ధిక ఇబ్బందులతో సత మతమవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాం డ్ చేశారు. రోగులకు అవసరమైన మందులను అందేలా చర్యలు తీసుకోవాలని, వైద్యులు సమయానికి దవాఖానకు వచ్చే లా బయోమెట్రిక్‌ను సక్రమంగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసిం హ,  ముషీరాబాద్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్య క్ష, కార్యదర్శులు శ్రీధర్ రెడ్డి, ఆకుల అరుణ్ కుమార్, పార్టీ సీనియర్ నాయకులు శివ ముదిరాజ్, దీన్ దయాల్రెడ్డి, పి.శ్రీధర్ చారి, టెంట్ హౌస్ శ్రీనివాస్, వల్లాల శ్యామ్ యా దవ్, ఫిరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.