22-10-2025 01:39:31 AM
హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయ క్రాంతి): సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) కచ్చితంగా ఉండాల్సిందేనని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) స్పష్టం చేసినట్లు సమాచారం. కొన్ని రాష్ట్రాల ఉపాధ్యాయ సంఘాలు ఎన్‌సీటీఈకు వివరణ కోరగా ఈ వివరణ ఇచ్చింది. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది.
మిగతా రాష్ట్రాలు కూడా రివ్యూ పిటిషన్లు వేశాయి. మరోవైపు టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు విన్నవిం చాయి. ఆ విజ్ఞప్తులను ఎన్‌సీటీఈ తాజాగా తిరస్కరించినట్లు తెలిసింది. కొత్త టీ చర్లే కాదు..పాత టీచర్లకూ టెట్ తప్పని సరని తేల్చి చెప్పినట్లు సమాచారం. ఎన్‌సీటీఈ తాజా నిర్ణయంతో టెట్ అర్హత లేని టీచర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. సుప్రీంకోర్టు తీర్పుపై ఉపాధ్యాయ సంఘాలూ రివ్యూ పిటిషన్లను వేసిన విషయం తెలిసిందే.