22 June, 2026 | 1:18 AM

వడ్ల కొనుగోలులో చతకిల పడ్డ సర్కార్

22-06-2026 12:00 AM

ఎంపీ రఘునందన్ రావు

తూప్రాన్, జూన్ 21: ఈ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు విషయంలో చతికిల పడిందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. తూప్రాన్ మున్సిపల్ పట్టణంలోని రెండవ వార్డ్ కౌన్సిలర్ అశోక్ యాదవ్ పోచమ్మకు మొక్కుబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు.

అనంతరం రెండో వా ర్డు మహిళలు మహిళ సమైక్య భవనం లేద ని వినతి పత్రం అందించగా తక్షణమే పది లక్షల నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఇప్పటికి రోడ్ల పైన ధాన్యం కుప్పలు ఉన్నాయన్నారు. ఎన్ని వడ్లు పట్టిస్తే ఎన్ని బియ్యం అవుతాయో తెలియని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద వడ్లు తీసుకుపోయి పోస్తాను అనడం కరెక్ట్ కాదని అన్నారు.