యోగ మార్గం.. ఆరోగ్య భాగ్యం
ఎల్లారెడ్డి, జూన్ 21(విజయ క్రాంతి): యోగ అంటే ఆసనాలు వెయ్య డామో, ఉపిరి బిగ పట్టడమో కాదు జీవితాన్ని అధీనం లోకి తెచ్చుకోవడం మనదైన ఈ ప్రక్రియ అవసరం ,ఆధునిక జీవన శైలిలో కొని తెచ్చుకుంటున్న వ్యాధులను ఎదుర్కొనడానికి యోగ ఒక పారమో షధం , ఉరుకులు, పరుగుల జీవితం లో ఆత్మ కు స్వచ్ఛత మనసుకు ప్రశాంతత ఒంటికి వ్యాయామం ఏది ఉండట్లేదు ఈ పరిస్థితుల్లో మానవాళికి అందుబాటులో ఉన్న అతిపెద్ద భాగ్యం యోగ గాడి తప్పిన శరీరాన్ని సరైన దారిలో పెట్టడానికి ఆసనాలు ఉపయోగపడితే అంతర్గత ఉన్నతికి ప్రాణాయామ ధ్యానాలు ద్రోహం చేస్తాయి యోగాభ్యాసం ప్రాధాన్యాన్ని మెరుగుపరుచు కుందాం యోగాసనాలతో ప్రాణాయామం ధ్యానం ప్రతి ఒక్కరు చేయాలి.
12 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోనీ స్థానిక వైశ్య భవన్ లో జరిగిన యోగా కార్యక్రమం కు ముఖ్య అతిథి గా డీఎస్పీ శ్రీని వాస్ రావు, ఆర్డీవో రొడ్డ ప్రభాకర్ ఆయుష్ వైద్యురాలు దివ్యా లు పాల్గొన్నారు. యోగా గురూజీ నాగరాజ్ గౌడ్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి ముఖ్య అతిధులైన ఆర్డీవో ప్రభాకర్, డి.ఎస్.పి శ్రీనివాసరావు, ఆయుష్ వైద్యురాలు దివ్య ల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేశారు
అనంతరం యోగ శిక్షకులు నాగరాజ్ గౌడ్ ఆయన సతీమణి సుజాత గౌడ్ యోగ ప్రయోజనాలను యోగ ఆసనాలను వేయించారు స్వామీ వివేకానంద, రవింద్రనాథ్ ఠాగూర్, శ్రీ అరబిందో వంటి మహనీయులు పుట్టిన గడ్డపై యోగా కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి ఇస్తోందని అన్నారు.
అనంతరం ఆర్డిఓ ప్రభాకర్, డీఎస్పీ శ్రీనివాసరావు, ఆయుష్ వైద్యురాలు దివ్య చేతుల మీదుగా డాక్టర్ మారుతి రావు, ఉపాధ్యాయిని మాధురి నర్సింగరావు, యజ్ఞ సహిత సాధకుడు పూసల రవీందర్, తదితరులకు బహుమతులు అందజేశారు, అనంతరం యోగా గురించి ప్రసంగించారు, యోగ ముగింపు కార్యక్రమాన్ని విశ్రాంత ఉపాధ్యాయుడు పటేల్ నరసింహారావు మాట్లాడారు, యోగ కార్యక్రమానికి పలువురు పట్టణ వ్యాపారవేత్తలు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.






