యోగతోనే సంపూర్ణ ఆరోగ్యం..
బాన్సువాడ, జూన్ 21 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఎస్‌ఎంబీ ఫంక్షన్ హాల్లో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఆర్డీఓ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై యోగా ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక యోగా సాధన చేశారు. యోగను నిత్య జీవితంలో భాగంగా చేసుకుని ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ప్రతిజ్ఞ చేశారు.
ఆర్డీఓ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ యోగ భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్య మైన వారసత్వం. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కొంత సమయం యోగకు కేటాయిస్తే శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ఆత్మవి శ్వాసం కూడా పెరుగుతుంది. నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలిలో యోగ ఉత్తమ ఔషధం‘ అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కుశాల్, ఆయుష్ విభాగం వాలంటరీ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు కాసుల రోహిత్, కౌన్సిలర్ కాలెక్, గౌస్, మంద ప్రవీణ్ కుమార్, లక్క నరహరి, నర్వ శ్రీనివాస్, చందర్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






