calender_icon.png 12 September, 2025 | 9:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరీక్షలు రాయనివారు డీఎస్సీని వాయిదా వేయాలని కోరుతున్నారు

13-07-2024 06:11:03 PM

హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహించామన్నారు. నోటిఫికేషన్ లో లేని విధంగా 1:100 పిలిస్తే కోర్టులో మళ్లీ ఇబ్బందులు వస్తాయని, 1:100 పిలిస్తే మళ్లీ గ్రూప్-1 మొదటికి వస్తుందని సీఎం చెప్పారు.

రెండేళ్ల క్రితం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వేయాలంటున్నారు. వాయిదాల వల్ల రాజకీయ నిరుద్యోగులు, కోచింగ్ సెంటర్లకు లాభం చేకురుతుంది. పరీక్షలు రాయనివారు మత్రమే డీఎస్సీని వాయిదా వేయాలని కోరుతున్నారు. మార్చి 31లోపు ఖాళీలు తెప్పించి.. జూన్ 2 లోపు నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. డిసెంబర్ 9లోపు ఖాళీలను భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ తీసుకోస్తున్నామని సీఎం పేర్కొన్నారు.  విద్యా సంస్థలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదన్నారు.

తమ ప్రభుత్వంపై ఆర్థికభారంతో కూడిన సమస్యలు ఉన్నాయని, వాటిని అధిగమించి ముందుకెళ్తున్నామని ఆయన కొనియడ్డారు. విద్యాసంస్థలకు విశ్వాసం, నమ్మకం కల్పించేందుకే జేఎన్టీయూలో జరిగే నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య అనే కార్యక్రమానికి తము వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. తప్పు చేయాలన్న ఆలోచన గానీ, తప్పు విధానాలు ప్రోత్సహించాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. తప్పులను సరిదిద్దాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ముందుకెళ్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.