calender_icon.png 23 May, 2025 | 3:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీఠ

23-05-2025 12:00:00 AM

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఖానాపూర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే బుజ్జు పటేల్ అన్నారు. గురువారం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్ రే మిషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుజ్జు పటేల్ మాట్లాడుతూ.. మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవకు అంకితం అవ్వాలని అని అన్నారు.

మందులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ పడగల భూషణ్, వైస్ చైర్మన్ మజీద్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, మండల అధ్యక్షులు దయానంద్, పట్టణాధ్యక్షులు నిమ్మల రమేష్, సూపరిడెంట్ వంశీ తదితరులు ఉన్నారు.