calender_icon.png 8 August, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధారి మినీ స్టేడియానికి స్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

08-08-2025 06:27:05 PM

గాంధారి (విజయక్రాంతి): గాంధారి మండలం(Gandhari Mandal) మినీ స్టేడియానికి గాంధారి మండల కేంద్రంలో 5 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లైన్ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మినీ క్రీడా మైదానానికి సంబంధించి ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేయించిన ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావుకు గాంధారి మండల ప్రజల తరపున యువజన సంఘాల తరపున క్రీడాకారుల తరపున గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.