08-08-2025 06:23:13 PM
మండల ప్రత్యేక అధికారి శివకుమార్..
తాడ్వాయి (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా జరగాలని తాడ్వాయి మండలం ప్రత్యేక అధికారి శివకుమార్(Mandal Special Officer Sivakumar) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ, ఎర్ర పహాడ్, ఏండ్రియల్, తాడ్వాయి గ్రామాల్లో ఆయన శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీల రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఎంతో ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని ఈ నిర్మాణాలు వేగవంతంగా నిర్మించుకోవాలని సూచించారు. ఇండ్ల నిర్మాణాలు నాణ్యతగా ఉండాలన్నారు. అనంతరం గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించారు. గ్రామపంచాయతీలో ఎలాంటి అవకతవకలు ఉండరాదన్నారు. రికార్డుల్లో తప్పులు ఉన్నట్లయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాజిద్ అలీ, తదితరులు పాల్గొన్నారు.