30-07-2025 10:21:04 PM
రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ అభియాన్ తెలంగాణ ఇన్చార్జి సుభాష్
కామారెడ్డి (విజయక్రాంతి): ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ అభియాన్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ సుభాష్ అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా(Kamareddy District) కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల కోసం ప్రవేశపెట్టబడ్డాయని తెలిపారు. వాటిని ప్రతి గడపగడపకు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ప్రజలకు వివరించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ అభియాన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు గీరెడ్డి మహేందర్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పాత జ్ఞానేశ్వరి, మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మగోనిలక్ష్మీ రాజా గౌడ్, బిక్కనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, భిక్కనూర్ మాజీ ఎంపీపీ సుదర్శన్, మాజీ సి డి సి చైర్మన్ కారంగుల అశోక్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్ల రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దోమకొండ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.