20-08-2025 12:30:20 AM
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
బూర్గంపాడు,ఆగస్టు 19,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవా రం మండలంలో పర్యటించిన ఆయన మం డల పరిధిలోని పినపాక పట్టీనగర్, ఉప్పుసాక, అంజనాపురం, మోరంపల్లిబంజర్ గ్రా మాల్లో సీసీ రోడ్ల ప్రారంభోత్సవంతో పాటు పలు సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు.
అనంతరం అంజనాపురం లో రూ.12లక్షల తో నిర్మించతల పెట్టిన అంగన్వాడీ నూతన భవన నిర్మాణ పనులకు ఆయన భూమిపూ జ నిర్వహించి గ్రామంలో రూ.12లక్షలతో రెండు సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో 18 పంచాయతీల్లో సీసీ రోడ్లను ఏర్పాటు చేయించే బాధ్యత నా దని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తనవంతు కృషి, సహకారం ఉంటుందన్నారు.
అంతర్గతంగా ఉన్న రహదారులను సీసీ రోడ్లుగా మార్చి ప్రజల మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రభుత్వం పనిచేస్తుంద న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తుందని, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కేఆర్ కెవి ప్రసాద్, ఎంపీడీవో జమలారెడ్డి, పంచాయతీ రాజ్ డీఈ పొదెం వెంకటేశ్వర్లు, ఏఈ చారి, ఐసీడీఎస్ సీడీపీవో రేవతి, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మీపురం మాజీ ఉపసర్పంచ్ పోతిరెడ్డి వెం కటేశ్వరరెడ్డి, మాజీ జడ్పీటీసీ బట్టా విజయ్‌ంధీ, బాదం రమేష్ రెడ్డి, కైపు శ్రీనివా సరెడ్డి, భజన సతీష్, ప్రసాద్, ఇంగువ రమే ష్, బర్ల నాగమణి, సుగుణ, భూక్యా సేవాలాల్, ఆనంద్, నర్సింహ, శ్రీకాంత్, హాను, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.