20-08-2025 12:29:58 AM
రైతులకు ఎక్కువ ధరలకు అమ్మితే కేసులు నమోదు చేస్తాం
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తిమండల కేంద్రంలోని పీఏసీఎస్, ఫెర్టిలైజర్స్, యూరియా దుకాణాలను ఆర్డీవో వేణు మాధవరావు మంగళవారం తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా, విత్తనాలను పంపిణీ చేయాలన్నారు. ఎమ్మార్పీ ధరల కంటే అధికరేట్లకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. అనంతరం సహకార సొసైటీని, గంగమిత్ర షాపును, ఆయా దుకాణాల్లో స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించారు. వారి వెంట తహశీల్దార్ దయానందం ఉన్నారు.