03-08-2025 12:48:01 AM
- గేటు ముందు విద్యార్థుల పడిగాపులు
- భూ వివాదమే కారణం
నాగర్‌కర్నూల్, ఆగస్టు 2 (విజయక్రాం తి): నాగర్‌కర్నూల్ జిల్లా బొందలపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు తాళం వేయడంతో విద్యార్థులు గేటు ముందే పడిగాపు లు కాశారు. ఈ ఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. పాఠశాల పునర్నిర్మాణం కోసం గ్రామంలోని కొందరు భూమి దానం చేశారు.
దానం చేసిన స్థలంలో కాకుండా మరికొంత ఎక్కువ స్థలంలో నిర్మాణం చేపట్టారని సదురు బాధితుడు కోర్టు మెట్లు ఎక్కాడు. తనకు అనుకూలంగా తీర్పు వచ్చిందంటూ కొంత హంగామా చేస్తూ శుక్రవారం సాయంత్రం టీచర్లను, విద్యార్థులను బయటికి పంపి తాళం వేసే ప్రయత్నం చేశాడు. పాఠశాలకు తాళం వేసి ఉండటంతో విష యం తెలుకున్న ఎంఈవో భాస్కర్‌రెడ్డి చట్ట ప్రకారమే అనుసరించాలని సూచించడంతో తాళం తీసినట్లు తెలిపారు.