calender_icon.png 3 August, 2025 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్లు ఆగవు

03-08-2025 12:47:46 AM

మంత్రి పొంగులేటి 

హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): రాష్ర్ట ఆర్ధిక పరిస్ధితి ఎంత క్లిష్టంగా ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని రాష్ర్ట రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. శనివారం సచివాలయంలోని తన కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ..

ఇండ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడలేదని ఆరోపించారు. ఒక్కో ఇంటికి గ్రామీణ ప్రాం తాల్లో రూ. 72 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 1.52 లక్షలు మాత్రమే ఇస్తున్నా రాష్ర్ట ప్రభుత్వం రూ. 5 లక్షలు ఇస్తోందని వివరించారు. కేం ద్రం నుంచి అరకొర సహాయంపై ఆధారపడకుండా రాష్ర్టంలో అనుకున్న ప్రకారం ఇం దిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నట్టు తెలిపారు. కేంద్రం సూచించిన విధంగా రీసర్వే కూడా చేపట్టామని సర్వే తుది దశలో ఉందని పే ర్కొన్నారు.

ఇండ్ల నిర్మాణ పనులు ఆశించిన స్ధాయిలో పురోగతిలో ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఒక దశ లేకుండా గత ప్రభు త్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించిందని వీటిలో చాలా వరకు అసంపూర్తిగా నిర్మాణంలోనే ఆగిపోయాయ ని.. ఈ ఇండ్లలో కనీస వసతులు కూడా కరువయ్యాయని ఆరో పించారు. వీటన్నింటికీ అవసరమైన మరమ్మతులు చేపట్టి లబ్ధిదారులకు కేటాయించబోతున్నట్టు పేర్కొన్నారు. భూ భారతి దరఖాస్తుల్లో ప్రధానం గా సాదాబైనామాలకు సంబంధించినవే ఉన్నాయని... ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉందని కోర్టు తీర్పురాగానే పరిష్కరించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. 

తెలంగాణ చరిత్ర, ఉద్యమం, కళలపై పుస్తకావిష్కరణ 

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పీఏ, డిప్యూటీ తహసీల్దార్ డాక్టర్ పైళ్ల నవీన్ రెడ్డి రచించిన తెలంగాణ చరిత్ర, ఉద్యమం, కళలు, సాహిత్యం ఐదో ఎడిషన్‌ను మంత్రి పొంగులేటి ఆవిష్కరించారు. పుస్తక రచయిత నవీన్ రెడ్డిని ఈ సందర్బంగా మంత్రి అభినందించారు. మూస పద్ధతిని వదిలి సరికొత్త ఆలోచనా విధానంతో ప్రస్తుత పోటీ పరీక్షలకు అనుగుణంగా పుస్తకాన్ని రచించడం అభినందనీయమన్నారు.