6 August, 2026 | 2:32 AM

హరీశ్‌రావుకు బోనాల జాతర ఆహ్వానం

06-08-2026 12:00 AM

ముషీరాబాద్,ఆగస్టు 5 (విజయక్రాంతి): ఈ నెల10న బీఆర్‌ఎస్ నాయకుడు రేషం మల్లేష్ ఆధ్వర్యంలో బుధవారం రాంనగర్ బోనాల జాతరకు హాజరుకావాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును బీఆర్‌ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీష్ రావుకు జాతర విశేషాలను వివరించి, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ కార్పొరేటర్ వి. శ్రీనివాసరెడ్డి, ఎంఎన్ శ్రీనివాస్, నాగేష్ ముదిరాజ్, నగర నాయకులు సిరిగిరి శ్యామ్, కల్వ గోపి, నేత శ్రీనివాస్, అజయ్, చిట్టి శ్యాంసుందర్, జుగేందర్, రేషం మణికంఠ తదితరులు పాల్గొన్నారు.