calender_icon.png 10 October, 2025 | 3:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొక్కజొన్నకు ప్రభుత్వ మద్దతు ధర

10-10-2025 01:49:17 AM

-కొనుగోలుకు చేసేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధం

-కొనేందుకు ముందుకు రాని కేంద్రం

-వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి) : మొక్కజొన్న పంటను రాష్ర్ట ప్రభుత్వమే మద్ధతు ధరకు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మొక్కజొన్న పంటకు కేంద్రం మద్ధతు ధర ప్రకటించినప్పటికి ఇప్పటివరకు కొనుగోళ్లకు ముందుకు రాకపోవడం తో మార్క్ ఫెడ్ ద్వారా  కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు మంత్రి తుమ్మల పేర్కొ న్నారు.

మొక్క జొన్న కొనుగోలు అంశంపై సీఎం రేవంత్‌రెడ్డితో మంత్రి తుమ్మల నాగేశ్వరావు గురువారం సమావేశమై చర్చించా రు. గత సంవత్సరం కూడా కేంద్రం కేవలం మద్ధతు ప్రకటనకే పరిమితమై, ఎలాంటి కొనుగోళ్లు జరపకపోయినప్పటికి రాష్ర్ట ప్ర భుత్వమే దాదాపు రూ. 535 కోట్లు ఖర్చు పెట్టి రాష్ర్టంలో పండిన జొన్న పంటను మద్ధతు ధర చెల్లించి కొనుగోలు చేసినట్లు మంత్రి తుమ్మల చెప్పారు.

రాష్ర్టంలో మొత్తం 6,24,544 ఎకరాల్లో మొక్కజొన్న సాగు అయిందని, సాగు పరిస్థితులు మెరుగవ్వడంతో సగటున ఎకరాకు 18.50 క్వింట ల్ దిగుబడి వచ్చి, మొత్తం 11.56 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి అవుతుందని అంచనా వేసినట్టు తెలిపారు. అదేవిధంగా ఈ సీజన్ లో 8.66 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. సెప్టెంబర్ 3వ వారం నుంచే మార్కెట్‌లోకి  భారీగా మొక్కజొన్న పంట రావడం వలన ధరలు తగ్గిపోయాయని అన్నారు.

ప్రస్తుత మార్కెట్ ధరలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్‌పీ క్వింటాలకు రూ. 2,400 ఉంటే రూ. 441 తక్కువగా రూ. 1,959 రూపాయలు ఉందని, దీని వలన మొక్క రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని మంత్రి పేర్కొన్నారు.  8.66 లక్షల మెట్రిక్ టన్నులు మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడానికి రాష్ర్ట ప్రభుత్వంపె ైరూ.2400 కోట్ల భారం పడుతుందని, అయినప్పటికి రాష్ర్ట రైతుల ప్రయోజనార్థం మద్ధతు ధర చెల్లించి కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు.  

ఉద్యాన అభివృద్ధి ప్రణాళికను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ర్ట ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన ‘తెలంగాణ రాష్ర్ట ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక  2035’ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో కలిసి ఆవిష్కరించారు. ఉద్యాన పంటల ఉత్పత్తిని పెంచేందుకు  2035 వరకు అనుసరించాల్సిన లక్ష్యాలను ఈ ప్రణాళికలో నిర్ధేశించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్చాన్సల ర్ డి. రాజిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.  ఈ ప్రణాళిక పుస్తకాన్ని డాక్టర్ డి. రాజి రెడ్డి, డాక్టర్ ఎ. భగవాన్, డాక్టర్ జి.పి. సునందిని రూపొందించారు.